
క్రమశిక్షణతో ముందుకెళ్లాలి
భిక్కనూరు: ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ముందుకెళ్తే బంగారు భవిష్యతును పొందవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన బస్వాపూర్‌ను సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా లబ్ధిదారులు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో అన్ని వ్యాధులకు సంబంధించిన మందులను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ప్రతి కాన్పు ప్రభుత్వాస్పత్రిలో జరిగేలా ప్రజలకు చైతన్య పరచాలన్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. చదువుతో పాటు సామాజిక సేవలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సైన్స్ ల్యాబ్ వినియోగం, ప్రయోగాల గురించి ఆయన విద్యార్థుల ను ప్రశ్నించారు. సరైన సమాధానాలిచ్చిన విద్యార్థులకు నోటు బుక్కులను బహుమతిగా అందించారు. కార్యక్రమాలలో జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో విద్య, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, వై ద్యురాలు యెమీమా, హెచ్‌ఎం సబిత, హెల్త్ సూపర్‌వైజర్ వెంకటరమణ తదతరులు పాల్గొన్నారు.