
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పది బస్సులు..
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పది బస్సులు కేటాయించాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సోమవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఈ వి షయమై ఆయనకు వినతిపత్రం అందించా రు. దీనిపై స్పందించిన మంత్రి.. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పది బస్సులను కేటాయించాలని ఆర్డీసీ ఎండీకి ఆదేశాలు జారీ చే శారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో డిపో ఏర్పా టుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఉప్పల్‌వాయి, రంగంపేట
రైల్వే గేట్ల మూసివేత
కామారెడ్డి అర్బన్: మరమ్మతుల కారణంగా ఉప్పల్‌వాయి, రంగంపేట రైల్వేగేట్లను 13, 14, 15 తేదీల్లో మూసి ఉంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇంజినీరింగ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే ఉప్పల్‌వాయి, రామారెడ్డి, తిర్మన్‌పల్లి, మర్కల్, సదాశివనగర్, రంగంపట, మోషంపూర్, పోసానీపేట గ్రామస్తులు దీనిని గమనించాలని సూచించారు.
ఇంజినీరింగ్ కాలేజీలో
ఐదుగురి చేరిక
తెయూ(డిచ్‌పల్లి): నూతనంగా ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు మూడో విడత కౌన్సెలింగ్‌లో 81 మందిని కేటాయించగా, మొదటిరోజైన సోమవారం ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. వీరంతా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ)కి చెందిన విద్యార్థులేనని ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి తెలిపారు. కౌన్సెలింగ్‌లో కేటాయించబడిన మరికొంత మంది విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న వసతి సౌకర్యాలను పరిశీలించారన్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం హాస్టల్ వసతి కల్పించకపోవడంతో పలువురు విద్యార్థినులు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు.
తొలి విద్యార్థి అల్లె శ్రీచరణ్
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి అల్లె శ్రీచరణ్ తెయూ ఇంజినీరింగ్ కళాశాల లో తొలి విద్యార్థిగా అడ్మిషన్ పొందారు. ఆ యనకు ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి స్వాగతం పలికి అడ్మిషన్ అందజేశారు.
విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు
బాన్సువాడ : విద్యుత్ సేవలలో ఎలాంటి స మస్యలున్నా ఫిర్యాదు చేయవచ్చని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ ఎరుకల నారాయణ పేర్కొన్నారు. సోమవారం బీర్కూర్ విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ వినియోగదారు ల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్ మండలంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ సమస్యలపై వినియోగదారులు పో స్టు ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ ఫోరమ్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచుతామ న్నారు. ఎలాంటి రుసుము లేకుండా ఫిర్యా దు చేయవచ్చాన్నారు. కార్యక్రమంలో ఫో రం సభ్యులు రామకృష్ణ, కిషన్, రాజగౌడ్ త దితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పది బస్సులు..