
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
బీబీపేట/దోమకొండ : మండల స్థాయిలు అఽధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.బీబీపేట, దోమకొండ మండల పరిషత్ కార్యాలయాల్లో మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులతో మాట్లాడారు. ఇక నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి రివ్యూ సమావేశం ఉంటుందని, తానే హాజరవుతునాని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయా శాఖల్లో ఉన్న సమస్యలను అధికారులు వివరించారు. అలాగే ప్రతి గ్రామంలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని కార్యదర్శులకు సూచించారు. అంగన్‌వాడీ లో నూతన భవనాలు మంజూరు అయినందన ప్రభుత్వ స్థలాన్ని చూసి కేటాయించాలని తహసీల్దారుకు తెలిపారు. విద్య, వైద్యంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా ఊరుకునేది లేదని అన్నారు. గ్రామాల వారిగా పూర్తి వివరాలు ఉన్నాయని ఏ శాఖలో తప్పులు జరిగినా సహించేది లేదని సూచించారు. వైన్స్‌ల వద్ద ఉన్నటువంటి పర్మిట్ రూంల్లో వసతులు ఉండాలని తెలిపారు.రైతులకు యూరియా కొరత రాకుండా చూడాలని వ్యవసాయశాఖ అధికారులు, సింగిల్‌విండో కార్యదర్శులకు ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు గంగసాగర్, సుధాకర్, ఎంపీడీవోలు పూర్ణచంద్రోదయకుమార్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, మండల వ్యవసాయాధికారులు దీపిక, నరేందర్, ఎకై ్సజ్‌శాఖ సీఐ మధుసూధన్‌రావ్, ఐసీడీఎస్ సీడీపీవో రోషిశ్మ, ఉపాధిహమీ ఏపీవో రజని, తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో బంగారు భవిష్యత్తు
భిక్కనూరు: విధ్యార్థులు చిన్నతనం నుంచి క్రమశిక్షణతో ముందుకెళ్తే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి అన్నారు. భిక్కనూరు మండలం ఇసన్నపల్లి, భాగిర్తిపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నాణ్యమైన వైద్యం విద్య
పేదలకు అందాలి
అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే
కాటిపల్లి వెంకటరమణారెడ్డి