
సూచిక బోర్డుల ఏర్పాటు
నస్రుల్లాబాద్ : మండలంలో జరుగుతున్న 765డి రోడ్డు పనులలో భాగంగా ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మంగళవారం మండల వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న గుంతల వద్ద సంబంధిత వారితో మాట్లాడి సూచిక బోర్డులను పెట్టించారు. రాత్రి వేళ్లలో గుంతలు ఉన్న చోటు కనబడే విధంగా రేడియం స్టిక్కర్లు ఉంచాలన్నారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.
డ్రంకెన్‌డ్రైవ్‌లో రెండురోజుల జైలు శిక్ష
కామారెడ్డి క్రైం: పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన నిఖిల్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు మంగళవారం కామారెడ్డి కోర్టులో హాజరుపర్చారు. ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ అతడికి రెండు రోజుల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు.
భిక్కనూరులో..
భిక్కనూరు : మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ ఒక్కరికి కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండు రోజలు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై అంజనేయులు మంగళవారం తెలిపారు. మండల కేంద్రంలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఒక్కరూ మధ్యం సేవించి వాహనం నడుపుతు పట్టుబడ్డాడు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ ముందర ప్రవేశపెట్టగా రెండు రోజలు జైలుశిక్షతో పాటు రూ.200 జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు.
పేకాడుతున్న 10మంది అరెస్టు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని వడ్లం గ్రామంలో పేకాట ఆడుతున్న పదిమందిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు గ్రామంలోని పేకాట స్థావరంపై సోమవారం రాత్రి దాడి చేశారు. పేకాడుతున్న పది మందిని పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.14430 నగదును, 9 ఫోన్లు, ఐదు బైక్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.