
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
కామారెడ్డి క్రైం: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తాయని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని గాంధీగంజ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లడారు. మీడియం గూడ్స్ వెహికల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 సీసీ కెమెరాలు, కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు, సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బంది, మీడియం గూడ్స్ వెహికల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విఠల్‌రావు, సురేష్, బాల్‌రాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి