
ఏటీసీలతో ఉజ్వల భవిష్యత్తు
కామారెడ్డి క్రైం : ప్రభుత్వ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)లలో ప్రవేశం పొంది ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీలలో అడ్మిషన్ల పెంపుపై కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ ఐటీఐ కోర్సులతో పాటు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌లో నైపుణ్య ఆధారిత కోర్సుల అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా కోర్సుల ద్వారా యువత త్వరగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశాలు ఉంటాయన్నారు. జిల్లాలోని విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శుల ద్వారా స్థానికంగా ఉండే విద్యార్థులకు సమాచారం ఇప్పించాలన్నారు. బిచ్కుంద, తాడ్వాయి, ఎల్లారెడ్డిలలో ఉన్న ఏటీసీలలో చేరడానికి ఈ నెల 28 వరకు గడువు ఉందన్నారు. కార్యక్రమంలో డీపీవో మురళి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుదాస్, ప్రిన్సిపాల్స్ ప్రమోద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలలో చేర్పించాలి
జిల్లాలో మిగిలి ఉన్న వారిని స్వయం సహాయక సంఘాలలో చేర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరి యంలో సోమవారం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సా మాజిక చేకూర్పు, నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చే శారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో స్వయం సహాయక సంఘాలలో లేనివారిని సంఘాలలో చేర్పించడానికి చర్యలు తీసుకోవాలన్నా రు. అలాగే 60 ఏళ్లు నిండిన వృద్ధ మహిళల కోసం వృద్ధుల సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపువారికోసం కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వి భిన్న ప్రతిభావంతుల సంఘాలనూ తయారు చే యాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదన పు కలెక్టర్ చందర్‌నాయక్, డీఆర్డీవో సురేందర్, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎంలు శ్రీనివా స్, సాయిలు, సురేష్, శోభ, రాజయ్య, 22 మండలాల ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య ప్రతిని ధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోర్సులపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్