
స్వయం ఉపాధితో రాణింపు
లింగంపేట: మహిళా సంఘం సభ్యురాలిగా చేరి పొదుపు చేస్తూ, బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ముందుకు సాగిన మోతెకు చెందిన సులోచన.. దేశ రాజధానిలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథిగా ఎంపికయ్యారు. లఖ్‌పతి దీదీగా ఆ వేడుకలలో పాల్గొనబోతున్నారు. ఈ అవకాశం వచ్చినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇరవై ఏళ్ల క్రితం సంఘంలో చేరిక
మోతె గ్రామంలో 20 ఏళ్ల క్రితం ఓం సాయి మహిళా సంఘంలో సులోచన సభ్యులుగా చేరారు. ఆమె చొరవతో మోతె మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి గ్రామ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. మహిళా సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరిన సులోచన.. ప్రతి నెల చిన్న మొత్తంలో పొదుపు జమ చేయడంతోపాటు స్వయం ఉపాధికోసం సంఘం నుంచి రుణం తీసుకున్నారు. అలాగే సంఘ సభ్యులతో కలిసి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు పొందారు. వాటిని తొలుత వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులకు వినియోగించారు. తర్వాతి కాలంలో పిండి గిర్ని ఏర్పాటు చేసుకున్నారు. కూరగాయలు, పూలు తదితర పంటలు పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.
నాయకత్వ లక్షణాలతో ముందుకు..
అందరి సహకారంతోనే..
లఖ్‌పతి దీదీ కేటగిరిలో దేశ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఎంపికవడంపై సులోచన హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘంలోని తోటి సభ్యులతోపాటు గ్రామ, మండల, జిల్లా సమాఖ్య సభ్యులు, ఐకేపీ అధికారుల సహకారంతోనే రాణిస్తున్నానన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఆర్‌డీవో సురేందర్, ఏపీఎం వినోద్‌కుమార్, సీసీ రాజారెడ్డి ప్రోత్సాహంతో మహిళా సంఘాల సభ్యులం ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతున్నామని పేర్కొన్నారు.
ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న సులోచన
స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథిగా ఎంపికై న ‘లఖ్‌పతి దీదీ’
మొదట మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరిన సులోచన.. తర్వాత సంఘానికి నాయకురాలు అయ్యారు. గ్రామ సంఘాలకు అధ్యక్షురాలిగా, మండల సమాఖ్య అధ్యక్షురాలిగా, జిల్లా సమాఖ్య పాలకవర్గ సభ్యురాలిగా సేవలు అందించారు. అలాగే గ్రామ సంఘాల ఆదాయం పెంచడానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాన్ని గ్రామస్తుల సహకారంతో విజయవంతంగా నడిపించారు. ఇలా మహిళా సంఘం సభ్యురాలిగా రాణిస్తూ, స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న మహిళలను గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. లఖ్‌పతి దీదీ కేటగిరిలో పలువురిని ఎంపిక చేసి ఆహ్వానాలు పంపింది. రాష్ట్రంలో ఐదుగురికి ఆహ్వానం రాగా.. అందులో లింగంపేట మండలం మోతెకు చెందిన సులోచన ఒకరు. ఈనెల 15న ఢిల్లీలో నిర్వహించే వేడుకలలో ఆమె పాల్గొననున్నారు.