
పరీక్ష కేంద్రం పరిశీలన
భిక్కనూరు: భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో గురువా రం పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 171 మంది విద్యార్థులకుగాను 169 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని పరీక్షల నియంత్రణ అధికా రి సంపత్‌కుమార్ పరిశీలించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 22న ఉద యం 8 గంటలకు జిల్లా స్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల జూనియర్స్ ట్రయథ్లాన్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఒక్కో పాఠశా ల నుంచి ఒక్కో అంశంలో ఇద్దరు క్రీడాకారులకు మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు లేదా పుట్టిన తేది ధ్రువీకరణ ప త్రం వెంట తీసుకురావాలని సూచించారు.
కామారెడ్డి అర్బన్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ కామారెడ్డి డీఈ కల్యాణ్ చక్రవర్తిని ఉద్యోగులు ఘెరావ్ చేశారు. గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగు ల 1104 సంఘం ఆధ్వర్యంలో డీఈ కార్యా లయంలో నేలపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 ఏళ్లుగా స మస్యలను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆఫీసులో కనీ సం మూత్రశాలలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. సమస్యల పరిష్కారానికి సీఎండీ, ఇతర ఉన్నతాధికారులు అనుకూలంగా ఉన్నా కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి డీఈలు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. 30 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని డీఈ లు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. నిరసనలో 1104 యూనియన్ జిల్లా అధ్యక్షుడు కమలాకర్, కార్యదర్శి శ్రీనివాస్, ప్రతినిధులు జగదీష్, పర్వయ్య, రాములు, కృష్ణమూర్తి, నర్సింలు, రవీందర్ పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట: వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలాన్ని మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. 2019 ఫిబ్రవరిలో సమకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పదవీకాలాన్ని ఆరునెలలపాటు పొడిగించింది. ఆ గడువు గురువారంతో ముగియగా.. మరో ఆరు నెలలపాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గురువారం 2,334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటమట్టం 1,405అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి 1,393.50 అడు గుల (5.863 టీఎంసీలు) నీరు నిల్వ ఉంద ని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 2.969 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని పేర్కొన్నారు. జూన్ నెలాఖరు వరకు 0.406 టీఎంసీ ఇన్‌ఫ్లో రాగా.. జూలైలో 0.899 టీఎంసీ, ఆగస్టులో ఇప్పటివరకు 1.392 టీఎంసీల నీరు వచ్చిందని తెలిపారు. సింగూరు ప్రాజెక్టు వరద గేటు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
‘కల్యాణి’లోకి 230 క్యూసెక్కులు..
ఎల్లారెడ్డిరూరల్: తిమ్మారెడ్డి శివారులోని కల్యాణి ప్రాజెక్టులోకి 230 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 అడుగులు కాగా.. 408.50 అడుగుల నీటిని ఉంచుతూ 230 క్యూసెక్కులను నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌కు మళ్లిస్తున్నారు.

పరీక్ష కేంద్రం పరిశీలన