
అవినీతే అసలు సమస్య!
● స్వేచ్ఛ, సమానత్వం అంతంతే...
● చట్టసభలు నిజాయితీగా పనిచేయాలి
● ‘సాక్షి’ సర్వేలో ప్రజలు
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ
దక్కాలంటే మరింత నిజాయితీగా పనిచేయాల్సిన రంగం..
మీరు ఎదుర్కొంటున్న
అతిపెద్ద సమస్య ఏదీ?
స్వేచ్ఛ, సమానత్వం నిజంగానే
అందరికీ అందుతున్నాయా?
● అధికార
యంత్రాంగం
● చట్ట
సభలు
● న్యాయ
స్థానాలు
● పేదరికం
● అవినీతి
● నాణ్యమైన విద్య
● అవును
● కొద్దిగా
● లేదు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘‘దేశంలో అవినీతి అనేది పెద్ద సమస్యగా మారింది. అవినీతి అంతమైతేనే ముందుకు వెళ్లగలుగుతాం. స్వతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే చట్టసభలు నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని వివిధ వర్గాలు అభిప్రాయపడ్డాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గురించి 30 మందిని అడిగితే 18 మంది అవినీతి గురించే చెప్పారు. పేదరికం గురించి ఆరుగురు, ఇతర సమస్యల గురించి మరో ఆరుగురు వివరించారు. కుల వివక్ష, వైద్యం గురించి ఎవరూ ప్రస్తావించలేదు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే చట్టసభలు, అధికార యంత్రాంగం మరింత నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ అంశంలో మీడియా గురించి ఎవరూ ప్రస్తావించలేదు.

అవినీతే అసలు సమస్య!

అవినీతే అసలు సమస్య!