
స్వాతంత్య్ర దినోత్సవాల అతిథిగా కోదండరెడ్డి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోదండరెడ్డి 15న జిల్లా కేంద్రంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం జరిగే సమావేశంలో జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తారు. కామారెడ్డికి చెందిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఆదిలాబాద్ జిల్లాకు అతిథిగా వెళ్తున్నారు.
పీజీ ఫలితాలు విడుదల
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి కే.సంపత్‌కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే.కిష్టయ్య ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
పోచారం ప్రాజెక్టు పరిశీలన
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టులో నీటిమట్టాన్ని బుధవారం ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. రెండు, మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులోని నీటిఅంచుకు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈ అక్షయ్‌కుమార్‌కు సూచించారు. ఆయన వెంట ఏఈతోపాటు వర్క్‌ఇన్‌స్పెక్టర్ యాదగిరి ఉన్నారు.
‘నాణ్యమైన విద్యుత్
సరఫరాయే లక్ష్యం’
బీబీపేట: జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఇస్సానగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతన బ్రేకర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సబ్‌స్టేషన్‌లో గ్రామంలో విద్యుత్ సరఫరాకు ఒక బ్రేకర్, వ్యవసాయ కనెక్షన్‌లకు మరొకటి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీని వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉంటుందన్నారు. ఎవరూ సొంతంగా మరమ్మతులు చేయరాదని, ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ కల్యాణ్ చక్రవర్తి, ఏడీఈ సుదర్శన్‌రెడ్డి, ఏఈ విజయభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.
విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధం
కామారెడ్డి అర్బన్: భారీ వర్షాలు కురిసినప్పు డు ఎదురయ్యే పరిస్థితులు, విపత్తులను ఎదు ర్కొని చక్కదిద్దడానికి తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని విద్యుత్ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ తెలిపారు. వినియోగదారులు అత్యవసర పరిస్థితుల్లో 1912తో పాటు 87124 81946 నంబర్‌లలో సంప్రదించాలని సూచించారు.

స్వాతంత్య్ర దినోత్సవాల అతిథిగా కోదండరెడ్డి

స్వాతంత్య్ర దినోత్సవాల అతిథిగా కోదండరెడ్డి