
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాడ్వాయి (ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లి గ్రామంలో బుధవారం పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన పరువాజిగారి శివాజీ రావు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పెళ్లి నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. అనంతరం బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రెండుతులాల బంగారం, రూ.40వేల నగదు, వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు.
అదుపుతప్పిన కంటైనర్
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామశివారు 44వ జాతీయ రహదారిపై కంటైనర్ అదుపుతప్పింది. బుధవారం తెల్లవారుజామున నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్‌లు సురక్షితంగా బయటపడ్డారు. సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ