
భూగర్భ జలాల వృద్ధే లక్ష్యంగా..
సదాశివనగర్‌లో నిర్మిస్తున్న ఫాంపాండ్
సదాశివనగర్ : వర్షపు నీరు వృథాగా పోకుండా నీటి కుంటల నిర్మాణానికి అధికారులు రైతులను ప్రో త్సహిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప థకం కింద నిర్మాణ పనులు చేపడుతూ భూగర్భ జ లాల వృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా వ్యవ సా య బోరు బావుల రీచార్జ్ కోసం ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నారు. పైభాగం నుంచి వచ్చే వరద నీరు భూమిలో ఇంకిపోయి వర్షాభావ సమయంలో పంట కాలానికి సరిపడా భూగర్భ జలాలు అందే అవకాశాలు ఉంటాయని అవగాహన కల్పిస్తున్నారు. ఫాంపాండ్స్ నిర్మాణంలో జిల్లాలో సదాశివనగర్ మండలం ఆదర్శంగా నిలుస్తోంది.
ఏడు రకాల గుంతలు..
నీటి నిల్వ కోసం వివిధ రకాల ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. కమ్యూనిటీ ఇంకుడు గుంత, డ్రెయి నేజీ ఇంకుడు గుంత, రాతి కట్టడాల చెక్‌డ్యాములు, అటవీ ప్రాంతాల్లో భారీ నీటి నిల్వ కుంటలను ఏ ర్పాటు చేస్తున్నారు. సదాశివనగర్ మండలంలో 52 నీటి కుంటల నిర్మాణం లక్ష్యం కాగా 27 నీటి కుంట ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 11 క మ్యూనిటీ నీటి గుంతల్లో ఆరు పూర్తయ్యాయి. 15 వ్యక్తిగత ఇంకుడు గుంతల్లో 10 ప్రారంభ దశలో ఉ న్నాయి. గ్రామానికి మూడు చొప్పున డ్రెయినేజీ ఇంకుడు గుంతల ప్రారంభించారు. 40 రాతి కట్టడా ల చెక్‌డ్యాములు పూర్తయ్యాయి. 20 లక్షల లీటర్ల నీ టి సామర్థ్యం గల రెండు ఫాంపాండ్లలో ఒకదాన్ని నిర్మిస్తున్నారు.
రైతులను ప్రోత్సహిస్తున్నాం
ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని ప్రజలను ప్రో త్సహిస్తున్నాం. ఇంకుడు గుంతల నిర్మాణంతో ఉపా ధి కూలీలకు పని దొరుకుతుంది. రైతులు బోరు బా వుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకునేందుకు ముందుకు రావాలి. అందరి కృషితో లక్ష్యాన్ని అధిగమిస్తాం. ఇంకుడు గుంతల నిర్మాణంలో మండలం ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉంది.
–సంతోష్‌కుమార్, ఎంపీడీవో, సదాశివనగర్
నీటి కుంటల నిర్మాణానికి
అధికారుల కృషి
సదాశివనగర్‌లో జోరుగా నిర్మాణాలు

భూగర్భ జలాల వృద్ధే లక్ష్యంగా..