కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్ప కూలుతోందని ఆర్‌ఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జాతీయ నాయకుడు నూర్ మహమ్మద్ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ఆర్‌ఎస్‌యూ ప్లీనరీ సమావేశాల్లో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని, మౌలిక వసతుల లేమితో బోధన, పరిశోధన కార్యక్రమాలు దెబ్బ తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఎక్కువగా 26, 27 తేదీల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. దీంతో దేవస్థానంలో ఈ రెండ్రోజులూ ఏ వివాదం లేకుండా గట్టెక్కితే అదే చాలు అనే అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పెళ్లి బృందాలకు వసతి గదుల కోసం పెద్ద ఎత్తున సిఫార్సులు రావడమే. వైశాఖ మాస వివాహాల తరువాత రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగేది శ్రావణ మాసంలోనే. సత్యదేవుని సన్నిధిలో ప్రతి ఏటా ఐదు వేలకు పైగా వివాహాలు జరుగుతుండగా శ్రావణ మాసంలో సుమారు వేయి వివాహాల వరకు జరుగుతాయని అంచనా. సత్యదేవుని సన్నిధిలోని న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాలు, ప్రకాష్ సదన్, హరిహరసదన్ ఆవరణలో, విష్ణుసదన్‌లోని 36 వివాహ హాళ్లలో వివాహాలు జరుగనున్నాయి. ఇవి కాకుండా మట్టే శ్రీనివాస్ దంపతులు నిర్మించిన సత్యశ్రీనివాస ఉచిత కల్యాణ మండపం, ఎంఎస్ రెడ్డి నిర్మించిన కల్యాణ మండపంలోని 24 ఉచిత కల్యాణ వేదిక (మండపాలు)లో వివాహాలు జరుగుతున్నాయి.
గదులకు భారీ డిమాండ్...
26, 27 తేదీల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతుండటంతో సత్రం గదులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దేవస్థానం సత్రాల్లో దాదాపు 500 గదులుంటే వాటిలో 70 శాతం అంటే 350 గదులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజర్వ్ అయిపోయాయి. మిగిలిన 150 గదులకు 300 సిఫార్సు లేఖలు, ఫోన్లు, మెసేజ్‌లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ సిఫార్సులలో దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులవి కూడా ఎక్కువే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఉన్న వసతి గదులను ఈ రెండ్రోజుల్లో ఎలా సర్దుబాటు చేయాలా అని సీఆర్వో కార్యాలయ సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు. ఒకే వివాహం కోసం మూడు నాలుగు సిఫార్సులు వచ్చిన లేఖల్లో ఒక దానినే పరిగణనలోకి తీసుకుంటున్నారు. రెండు గదులు కావాల్సినవారికి ఒక గది మాత్రమే కేటాయించి సర్దుకోమంటున్నారు. ఇలా ఏదోక విధంగా వివాదం లేకుండా ఈ రెండ్రోజులు గట్టెక్కెతే చాలని అధికారులు కోరుకుంటున్నారు.
కొండ కింద కూడా ఫుల్..
కొండ దిగువన సుమారు 30 లాడ్జిలు, కల్యాణమండపాలు, హోటళ్లు ఉండగా అవన్నీ ఈ రెండ్రోజులకూ హౌస్‌ఫుల్ అయ్యాయి. వీటిలో 20 కల్యాణ మండపాలు, 300 గదులు ఉన్నాయి. వీటన్నింటినీ పెళ్లి బృందాలు రిజర్వు చేసుకున్నాయి.
రత్నగిరిపై 150కి పైగా వివాహాలు
ఆ రెండ్రోజులు సత్రాల
గదులకు భారీ డిమాండ్
500 గదులకు
350 ఇప్పటికే రిజర్వ్
మిగిలిన 150 గదులకు
300 సిఫార్సులు!
కొండ దిగువన లాడ్జిలు,
కల్యాణ మండపాలు,
హోటళ్లు కూడా హౌస్‌ఫుల్


