అమలాపురం టౌన్: జిల్లా కేంద్రం అమలాపురంలో ఏడు ఎకరాల్లో నిర్మితమవుతున్న జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ రూ.2 కోట్ల నిధులు కేటాయించారని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. అమలాపురం పాత పోలీస్ క్వార్టర్స్, జిల్లా పోలీస్ గ్రౌండ్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్‌హౌస్ (డీఎస్పీ కార్యాలయం)ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే పుష్కరాల లోపు జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతానికి అమలాపురం డీఎస్పీ కార్యాలయం లేదు కాబట్టి నూతనంగా నిర్మించిన ఈ పోలీస్ గెస్ట్ హౌస్‌ను కొద్ది రోజులు డీఎస్పీ కార్యాలయంగా ఉపయోగించుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, పేరాబత్తుల రాజశేఖర్, అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు.


