పిఠాపురం: వరుణుడి కరుణ కోసం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో ద్విభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ నేతృత్వంలో ఆస్థాన పురోహిత, పండిత, అర్చక బృందాలతో స్వామివారికి ఘట్టాభిషేకం, వరుణ జపాలు, మహా రుద్రాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ ఈ పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, సూపరింటెండెంట్ బొల్లం వీరభద్రరావు, రెడ్నం ప్రసాద్, పెంటపాటి సత్తిరాజు, కొప్పిశెట్టి దత్తత్రేయ తదితరులు పాల్గొన్నారు. అలాగే పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో లోకక్షేమం –సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి సన్నిధిలో మహారుద్రాభిషేకం, అష్టోత్తర శత కలశాభిషేకం, దత్త హోమం నిర్వహించారు. ఆలయ ఈఓ ఆర్.సౌజన్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.


