ప్రజల సమస్యలు వింటున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్
పీజీఆర్‌ఎస్‌లో సెల్ ఫోన్లు చూసుకుంటున్న అధికారులు
ఈ చిత్రం చూశారా.. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి వచ్చిన అధికారులు ఇలా సెల్‌ఫోన్లు చూస్తూ ఉండిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మండల, డివిజన్ స్థాయి అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పిఠాపురం పాడా కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ప్రజల బాధలను ఒకపక్క కలెక్టర్ వింటుంటే, మరోపక్క అధికారులు ఇలా సెల్‌ఫోన్లు చూస్తుండడంతో అక్కడికి వచ్చిన అర్జీదారులు ముక్కున వేలేసుకున్నారు.
– పిఠాపురం


