టీకా @ 87 శాతం
● చలికాలంలో పశువులకువైరస్ ముప్పు అధికం
● వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు
జిల్లాలో చివరి దశకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా పంపిణీ
మండలం మొత్తం టీకా
పశువులు పూర్తయినవి
అయిజ 14,589 12,351
గద్వాల 12,200 10,318
వడ్డేపల్లి 11,089 10,129
మల్దకల్ 10,585 9,079
ధరూర్ 10,674 8,742
ఇటిక్యాల 10,090 8,525
గట్టు 9,316 7,910
మానవపాడు 7,550 7,408
రాజోళి 7,748 6,565
అలంపూర్ 5,735 4,655
కేటీదొడ్డి 4,458 3,779
ఉండవెల్లి 4,216 4,213
గద్వాల వ్యవసాయం: పశువులకు వైరస్ ద్వారా వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణకు జిల్లా పశు సంవర్ధకశాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్టోబర్ 15 తేదీ నుంచి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు 87 శాతం పశువులకు టీకాలు వేశారు. ఇదిలా ఉండగా.. సాధారణంగా మూగజీవాలపై పలు రకాల వ్యాధులు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా పశువులకు వైరస్ ద్వారా గాలికుంటు వ్యాధి ప్రబలుతుంది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్‌గా ఈ వ్యాధిని పేర్కొంటారు. గాలిలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు గాలికుంటు వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన సమయంలో పశువుల్లో గర్భం విఫలమవుతుంది. నోరు, మూతి, కాళ్లు, గిట్టలపై పుండ్లు, బొబ్బలు రావడం, నోటి నుంచి విపరీతంగా నురగ రావడం, తీవ్రమైన జ్వరం వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. పశువుల లాలాజలం, పుండ్ల వల్ల, గాలి వల్ల వ్యాధి మిగతా పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. జ్వర తీవ్రత పెరిగి పశువులు నీరసిస్తాయి. ఫలితంగా పాడి రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి.
జిల్లాలో వ్యాక్సినేషన్ వివరాలిలా..
ప్రతి పశువుకు తప్పనిసరి
పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా పశువైద్య సిబ్బంది గ్రామ గ్రామాన ఉచితంగా టీకాలు వేస్తున్నారు. ఇందులో భాగంగా పాడి రైతులకు ముందస్తుగా సమాచారం అందిస్తున్నాం. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువులకు టీకాలు వేయించాలి.
– వెంకటేశ్వర్లు, జిల్లా పశువైద్యాధికారి
టీకా @ 87 శాతం
టీకా @ 87 శాతం


