అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అలంపూర్: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం రాజోళి, వడ్డేపల్లి, ఉండవెల్లి మండలాలకు చెందిన 202 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


