లెక్క తేలింది.. పోరు మిగిలింది!
అతివకు అందలం..
జిల్లాలోని 13 మండలాల పరిధిలో 255 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 116 సర్పంచ్ స్థానాలను మహిళలకు కేటాయించారు. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళకు 21, బీసీ మహిళకు 32, జనరల్ మహిళకు 62 స్థానాలను కేటాయించారు. అదే విధంగా జనరల్‌కు 67, బీసీ జనరల్‌కు 38, ఎస్సీ జనరల్‌కు 30, ఎస్టీ జనరల్‌కు 4 స్థానాలు కేటాయించగా.. అందులోనూ అతివలు పోటీ చేసే అవకాశం ఉంది. గత పర్యాయం జిల్లాలో అత్యధిక సంఖ్యలో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సహా జెడ్పీ చైర్‌పర్సన్ వరకు మహిళా ప్రజాప్రతినిధులు అధికంగా ఉండగా.. ఈ సారి కూడా అదే తీరులో అవకాశాలను ఆశిస్తున్నారు.
గద్వాలటౌన్: గ్రామపంచాయతీల వారీగా సర్పంచు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడింది. లాటరీ పద్ధతిన రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేసిన అఽధికారులు.. తాజాగా సోమవారం ఓటరు జాబితాను విడుదల చేశారు. ఓటరు జాబితాలో తప్పుల సవరణకు ఇటీవల ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. కుటుంబ సభ్యులందరి పేర్లు ఒకే బూత్ పరిధిలోకి వచ్చే విధంగా మ్యాపింగ్ చేశారు. పంచాయతీల వారీగా ఓటరు జాబితాను కలెక్టర్ అనుమతితో మండలాల అధికారులు విడుదల చేశారు. అన్ని గ్రామపంచాయతీల్లో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచారు. మొత్తమ్మీద పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగింది. షెడ్యూ ల్ విడుదలైన వెంటనే మిగతా ఏర్పాట్లు ఊపందుకోనున్నాయి. ఆ దిశగా అధికారులు సిద్ధంగా ఉన్నారు. స్థానిక పోరుకు చకచకా అడుగులు పడుతుండటంతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
ఇతరులు 10
ఓటేయడంలోనూ
వారే అధికం..
పల్లెల్లో మొదలైన రాజకీయ వేడి
ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు
తాజాగా ఓటరు జాబితా విడుదల
జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
జిల్లాలో ఓటర్ల సంఖ్యాపరంగా కూడా మహిళలే అధికంగా ఉన్నారు. అన్ని గ్రామాల్లో స్వశక్తి సంఘాలు ఉండగా.. ప్రస్తుత ఎన్నికల్లో వీరి పాత్ర కీలకంగా మారనుంది. గతంలో అన్ని ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఓటు వేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదే తరుణంలో పల్లెల్లో పోటీ పడేవారు అన్ని వర్గాల మహిళలను ప్రసన్నం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టిసారించారు.


