రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి
గద్వాలటౌన్: క్రీడాకారులు నిర్మాణాత్మక క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ.. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఎస్‌జీఎఫ్ జోనల్ స్థాయి అండర్–14 బాలబాలికల వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించగా.. ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఎంపిక పోటీలను డీఈఓ ప్రారంభించి మాట్లాడారు. క్రీడల పట్టణంగా గద్వాల అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులు స్ఫూర్తిదాయకమైన ఆట ద్వారా ప్రతిభ చాటాలన్నారు. డీవైఎస్‌ఓ కృష్ణయ్య మాట్లాడుతూ.. క్రీడలు జీవితానికి గొప్ప స్ఫూర్తినిస్తాయన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
క్రీడాకారులను పరిచయం చేసకుంటున్న
డీఈఓ విజయలక్ష్మి
విజేతలు వీరే..
వాలీబాల్ అండర్–14 బాలుర విభాగంలో నారాయణపేట జట్టు విజేతగా, జోగుళాంగ గద్వాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ విజేతగా నిలవగా.. నారాయణపేట జట్టు రన్నరప్‌గా నిలిచింది. ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 26 నుంచి పెద్దపల్లి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, హెచ్‌ఎం ప్రతాప్‌రెడ్డి, పీఈటీలు నగేశ్‌బాబు, హైమావతి, శ్రీనివాసు లు, బీసన్న, స్రవంతి, భరత్‌కుమార్, నర్సింహారాజు, తిరుపతి, మోహన మురళీ, పార్వతమ్మ, రజనీకాంత్, వెంకట్రాములు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి


