జీపీలలో మహిళా స్థానాలకు రిజర్వేషన్లు
గద్వాల: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని మండలాల వారిగా గ్రామ పంచాయతీలకు మహిళా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు తెలిపారు. ఆదివారం ఆర్డీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో డిప్ విధానంలో మహిళ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొదటిసారిగా 2019లో గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని నిబంధనల మేరకు ప్రస్తుతం జరిగే ఎన్నికలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ రిజర్వుడ్ స్థానాల్లో మహిళలకు కేటాయించాల్సిన 33 శాతం రిజర్వేషన్లను డిప్ విధానంతో ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అలివేలు, డీపీఓ నాగేంద్రం, ఇతర అధికారులు పాల్గొన్నారు.


