తెలంగాణ రాష్ట్రం వచ్చాక స్థానిక నేతలు నిర్వాసితుల సమస్యను అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్హులైన వారికి ఉద్యోగాలకు బదులుగా నగదు ప్యాకేజీ అందించాలని భావించారు. అది కూడా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఈ ఏడాది జటప్రోల్ సభలోనూ నిర్వాసితుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు నిర్వాసితులు మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. కానీ, సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు.
సర్వం కోల్పోయాం..
మా పూర్వీకుల స్వగ్రామం అసద్‌పూర్. శ్రీశైలం బ్యాక్‌వాటర్ కారణంగా మా ఊరంతా మునిగిపోయి సర్వం కోల్పోయాం. ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 98, 68 అమలు కోసం ఎదురుచూస్తున్నాం. నిర్వాసితుల్లో చాలా మంది పేదరికంతో చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకోవాలి.
– మేనుగొండ రాముయాదవ్,
శ్రీశైలం నిర్వాసితుడు
సీఎంను కలుస్తాం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జటప్రోల్ సభలో నిర్వాసితుల అంశంపై నివేదిక తయారు చేయాలని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుకు సూచించారు. నిర్వాసితుల వివరాలు, ఉద్యోగాల ఖాళీలు వంటి అంశాలపై కలెక్టర్లతో చర్చించామన్నారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
– డాగోజీరావు, శ్రీశైలం నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
●
స్వయంగా ప్రస్తావించిన రేవంత్‌రెడ్డి..


