మహిళల ఆర్థికాభివృద్ధికే వడ్డీలేని రుణాలు
గద్వాలటౌన్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి.. ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఐడీఓసీలోని సమావేశ హాల్‌లో మంగళవారం సెర్ఫ్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళాశక్తి స్వయం సహాయక సంఘాల సభ్యు లకు స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ వడ్డీలేని రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని 4,724 మహిళా సంఘాలకు రూ. 5.10 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరైనట్లు చెప్పారు. సంఘాల్లో కొత్త సభ్యులను సైతం చేర్పించి.. వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి.. ఆర్థిక బలోపేతానికి తోడ్పాటు అంది స్తోందన్నారు. అదే విధంగా బస్సుల కొనుగోలు కోసం మూడు మహిళా సంఘాలకు సబ్సిడీ రుణా లు అందించినట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభు త్వం అందించిన వడ్డీలేని రుణాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడ మే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం గద్వాల ని యోజకవర్గానికి సంబంధించి 2,248 మహిళా సంఘాలకు రూ. 2.28 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసు లు, డీపీఎంలు సలోమి, అరుణ పాల్గొన్నారు.


