అనుమతులనురద్దు చేయాలి
గద్వాలటౌన్: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి కార్తీక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆల్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎస్సీ సంస్థ కార్మికులకు అవసరం లేకున్నా హెల్త్ టెస్టులు చేస్తుందని.. టెస్టులు చేయించుకోకపోతే లేబర్ కార్డులను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. కార్మికులకు ఎలాంటి ఉపయో గం లేని సీఎస్సీ సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని కోరారు. అదే విధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జానకీరాంను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఉప్పేర్ నర్సింహ, ఆంజనేయులు, సీతారాం, శ్రీనివాస్, జమ్మన్న, గట్టన్న, శివ, రవి, మహేశ్, పరమేశ్ పాల్గొన్నారు.
ధ్వంసమైన పైపులైన్.. నిలిచిన నీటి సరఫరా
గద్వాలటౌన్: జిల్లా కేంద్రం నుంచి అయిజకు వెళ్లే మార్గంలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులతో తాగునీటి ప్రధాన పైపులైన్ ధ్వంసమైంది. దీంతో తాగునీరు వృఽథాగా పారింది. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి.. పైపులైన్‌కు మరమ్మతు పనులు చేపట్టారు. పైపులైన్ మరమ్మతు కారణంగా స్థానిక పిలిగుండ్ల కాలనీ తదితర ప్రాంతాలకు మంగళవారం తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బుధవారం సాయంత్రం నాటికి పైపులైన్ మరమ్మతు పూర్తిచేసి.. తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
మల్దకల్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని భగవంతుడిని ఆరాధించాలని మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అన్నారు. మంగళవారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో ప్రారంభమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని అన్నారు. సమాజంలో కులమతాలను రూపుమాపడానికి, ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి దైవభక్తి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ఉండటంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకునే వీలుంటుందన్నారు. అనంతరం పీఠాధిపతిని భక్తులు సత్కరించారు. అదే విధంగా స్వామివారి పల్లకీ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చక్రధర్‌రెడ్డి, రాముడు, వీరారెడ్డి, ఆలయ అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, బాబురావు, ముకుందరావు పాల్గొన్నారు.
ఆటల్లో అదరగొడుతున్నారు..
● రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
● నిరంతర సాధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణింపు
– వివరాలు 9లో..
అనుమతులనురద్దు చేయాలి
అనుమతులనురద్దు చేయాలి


