లార్వా దశలోనే నిర్మూలించాలి..
దోమ లార్వా దశలో ఉన్నప్పుడే నిర్మూలించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో క్రమం తప్పకుండా యాంటీ లార్వా ఆపరేషన్ చేయించాలి. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి, డంపింగ్ యార్డుకు చెత్తను తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి.
– శ్రీధర్, గద్వాల
నివారణ చర్యలు చేపడుతాం..
డ్రెయినేజీలో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లను తొలగించే పనులను ఇటీవల చేపట్టడం జరిగింది. దోమల నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటాం. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తాం. కాలనీల్లో ఫాగింగ్ యంత్రాలను వినియోగించడంతో పాటు దోమల నివారణ మందులను చల్లుతున్నాం.
– జానకీరాం,
మున్సిపల్ కమిషనర్, గద్వాల
లార్వా దశలోనే నిర్మూలించాలి..


