యాజమాన్య పద్ధతులు పాటించండి
అయిజ/అలంపూర్ రూరల్: రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి వరిలో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.శంకర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టిన ‘నాణ్యమైన విత్తనం రైతన్న నేస్తం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉప్పల,బుక్కాపురం గ్రామ శివారులో ‘ఆర్‌ఎన్‌ఆర్ 15048’ వరి రకం క్షేత్ర దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని పెంపొందించే ఉద్దేశంతో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నాణ్యమైన విత్తనం రైతన్న నేస్తం కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. ఆర్‌ఎన్‌ఆర్ 15048 వరి రకం, వాటి లక్షణాలు తెలియజేశారు. విత్తనోత్పత్తి చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలు గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. శంకర్, డాక్టర్ ఏ. శ్రీరామ్, డాక్టర్ ఆది శంకర్, డాక్టర్ కె. సిద్దప్ప, ఏఓ జనార్ధన్, వ్యవసా య విస్తరణ అధికారిని స్వాతి రైతులు పాల్గొన్నారు.


