దేదీప్యమానం.. కార్తీక దీపోత్సవం
కోటలోని ఆలయ ఆవరణ లో దీపాలు వెలిగిస్తున్న మహిళలు
గద్వాలటౌన్/అయిజ/ఎర్రవల్లి: పరమశువుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం చివరి రోజు.. అందులోను అమావాస్యను పురస్కరించుకుని చేపట్టిన దీపోత్సవ కార్యక్రమాలు వైభవంగా సాగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని దీపాలు వెలిగించారు. జిల్లా కేంద్రంలోని కోటలోని శ్రీభూలక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయం, నదిఆగ్రహారంలోని ఆలయాల సముదాయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దీపాలు వెలిగించారు. కొండపల్లి గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో వివిధ ఆకృతులలో వెలిగించిన ప్రమిదలు ఆకట్టుకున్నాయి. జములమ్మ పుష్కర ఘాట్‌లో సామూహిక కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు.
– బీచుపల్లి పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. ఉదయాన్నే కృష్ణానదిలో స్నానాలు ఆచరించిన భక్తులు.. శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవితో పాటు అభయాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ● అయిజ మండలం కురువపల్లిలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కనులపండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
దేదీప్యమానం.. కార్తీక దీపోత్సవం


