గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

Oct 24 2026 5:47 AM | Updated on Oct 24 2026 5:47 AM

గణపురం: శుక్రవారం సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.

కాళేశ్వరం అష్టతీర్థాలకు టెండర్లు పూర్తి

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.60కోట్లతో అష్టతీర్థాఽల ఘాట్ల నిర్మాణానికి ఇరిగేషన్‌శాఖ ద్వారా టెండర్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌కు చెందిన సరళ ప్రాజెక్ట్‌స్‌ దక్కించుకున్నట్లు తెలిసింది.

నేడు దేవాదాయ శాఖ కమిషనర్‌ రాక

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు శనివారం రానున్నారు. దేవస్థానం పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం వచ్చే ఏడాది కాళేశ్వరంలో జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల ఏర్పాట్లపై ఈ సందర్భంగా ఈఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ మహేశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ఏర్పాట్లు, దేవస్థాన అభివృద్ధి పనుల పురోగతిపై చర్చిస్తారని ఈఓ పేర్కొన్నారు.

జాతీయస్థాయికి

సాత్విక శ్రీని ఎంపిక

చిట్యాల: మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో సెకండియర్‌ చదువుతున్న మద్దెల సాత్విక శ్రీని జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ గొల్గొండ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12, 13 తేదీలలో సంగారెడ్డి జిల్లాలో హెచ్‌జీఎఫ్‌ రాష్ట్ర మీట్‌లో జరిగిన అండర్‌ 19 జూనియర్‌ కళాశాల కబడ్డీ చాంపియన్‌ షిప్‌ రాష్ట్రస్థాయి పోటీలకు వరంగల్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారని అన్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సి పాల్‌ భిక్షపతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.మాలాతిలత, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎం.వెన్నెల, పీఈటీ కె.శారద, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

రేపు రౌండ్‌టేబుల్‌

సమావేశం

భూపాలపల్లి అర్బన్‌: దేశ, రాష్ట్రాల్లో నెలకొన్న విద్యారంగ సంక్షోభ పరిస్థితులు, పాఠశాలల అభివృద్ధిపై చర్చించేందుకు ఈ నెల 25న భూపాలపల్లిలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎ.తిరుపతి, ప్రధాన కార్యదర్శి బి.సేవానాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కొమురయ్య భవన్‌లో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ లక్ష్మినారాయణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.

10మంది వేటగాళ్ల

బైండోవర్‌

మహాముత్తారం: 10మంది వన్యప్రాణి వేటగా ళ్లను శుక్రవారం మహాముత్తారం తహసీల్దార్‌ శ్రీనివాస్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు మహా ముత్తారం ఎస్సై రమేశ్‌ తెలిపారు. యామన్‌పల్లి గ్రామానికి చెందిన జాడి లక్ష్మన్‌, బొప్పారపు రాజేందర్‌, జనగాం వెంకటయ్య, ఆకుదారి శ్రీశైలం, పాగె పోచయ్య, కలోజాల సతీష్‌, జాడి చిన్నయ్య, రత్నం సడువలి, రాంచందర్‌, అట్టెం రాజబాపు ఉన్నారు. భవిష్యత్‌లో అక్రమాలకు పాల్పడకుండా ఉంటేందుకు ముందస్తు చర్యలో భాగంగా చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement