తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌.. కూతురు డీఎస్పీ | - | Sakshi
Sakshi News home page

తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌.. కూతురు డీఎస్పీ

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌.. కూతురు డీఎస్పీ

హసన్‌పర్తి: మొదటి ప్రయత్నంలోనే గ్రూప్స్‌కు ఎంపికై డీఎస్పీగా శిక్షణ పొందారు యాస్మిన్‌. ఆమె తండ్రి భూపాలపల్లి జిల్లా కాటారానికి చెందిన ఖదీర్‌. ఎకై ్సజ్‌ శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌. ఆయన ప్రస్తుతం రామగుండంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కుటుంబం హసన్‌పర్తిలోని ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలో ఉంటోంది. ఖదీర్‌కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు. పెద్ద కుమార్తె షా గుఫ్తా యాస్మిన్‌. చిన్నప్పటి నుంచి బాగా చదివేవారు. యాస్మిన్‌ ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్‌లో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లో చదివారు. ఆతర్వాత డిగ్రీ, పీజీ ఢిల్లీలో పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌–1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలలో ట్రెయినీ డీఎస్పీగా విధులు నిర్వర్తించనున్నారు. ఇటీవల షా గుఫ్తా యాస్మిన్‌ వివాహం తిరుపతిలో జరిగింది.

యూనిఫాం ధరించాలన్నది నా కల

నా తండ్రిని చూసి నేను కూడా పోలీస్‌ యూనిఫాం ధరించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఐపీఎస్‌ కావాలన్న లక్ష్యంతో సివిల్‌ సర్వీస్‌కు సిద్ధమయ్యా. ఢిల్లీలోనే సివిల్‌ సర్వీస్‌ కోసం కోచింగ్‌ తీసుకున్నా.

– షా గుఫ్తా యాస్మిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement