కరువు ఛాయలు | - | Sakshi
Sakshi News home page

కరువు ఛాయలు

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

కరువు ఛాయలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ :

కరువు పరిస్థితులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాను వెంటాడుతున్నాయి. ఖరీఫ్‌–2026లో వర్షాభావం, పంటల నష్టాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఆరు జిల్లాల్లో 38 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 315 కరువు మండలాల్లో ఉమ్మడి వరంగల్‌ వాటా గణనీయంగా ఉంది. మొత్తం 38 మండలాల్లో ఒక మండలంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉండగా.. 37 మండలాల్లో మోస్తరు కరువు నెలకొన్నట్లు అధికారిక జాబితా స్పష్టం చేస్తోంది.

జనగామలోనే తీవ్ర కరువు ప్రభావం..

హనుమకొండలో 11..

ఉమ్మడి వరంగల్‌లో తీవ్ర కరువు మండలం ఉన్న జిల్లా జనగామ. జిల్లాలోని నాలుగు మండలాలు కరువు ప్రభావితంగా గుర్తించగా.. అందులో ఒకటి తీవ్ర కరువు, మూడు మోస్తరు కరువు మండలాలు ఉన్నాయి. దీంతో జనగామ జిల్లాలో పంటల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. హనుమకొండ జిల్లాలో 11 మండలాలు కరువు ప్రభావితంగా ఉన్నాయి. వీటిలో ఒక్కటి కూడా తీవ్ర కరువు కేటగిరీలో లేకపోగా.. అన్నీ మోస్తరు కరువు మండలాలే కావడం గమనార్హం.

మహబూబాబాద్‌లో 6..

వరంగల్‌లో 8 మండలాలు..

మహబూబాబాద్‌ జిల్లాలో 6 మండలాలు కరువు జాబితాలోకి వచ్చాయి. ఇవన్నీ మోస్తరు కరువు ప్రభావిత మండలాలుగానే నమోదయ్యాయి. కాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 5 మండలాలు, ములుగు జిల్లాలో 4 మండలాలు కరువు ప్రభావితంగా గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లోనూ తీవ్ర కరువు మండలం ఒక్కటీ లేకపోగా.. మోస్తరు కరువు మండలాలే ఉన్నాయి.వరంగల్‌ జిల్లాలో 8 మండలాలు కరువు ప్రభావితంగా నమోదయ్యాయి. వీటన్నింటినీ మోస్తరు కరువు కేటగిరీలో చేర్చారు.

పంట నష్టాలే కరువు తీవ్రతకు అద్దం..

కరువు ప్రభావిత మండలాల్లో వర్షాభావ పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావం చూపినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు సకాలంలో కురవకపోవడం, పంటలకు అవసరమైన తేమ అందకపోవడం, దిగుబడులు తగ్గడం వంటి పరిణామాలు కరువు పరిస్థితులకు కారణమయ్యాయి. కరువు జాబితాలో ఉన్న మండలాలకు ప్రభుత్వం అందించే ఉపశమన చర్యలు, పంట నష్టపరిహారం, సాగునీరు–పశుగ్రాసం వంటి అంశాలపై రైతుల్లో ఇప్పుడు ఆశలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్‌లో 38 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ కరువు మండలాల పేర్లను మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం.

ఆరు జిల్లాల్లో

38 మండలాలు గుర్తింపు

ఒక్క మండలంలో తీవ్ర,

37 మండలాల్లో మోస్తరు కరువు

ఖరీఫ్‌ పంటలపై తీవ్ర ప్రభావం

ఎల్‌నినో ప్రభావంపై

వ్యవసాయశాఖ ఆరా..

మండలాల పేర్ల వెల్లడిపై గోప్యం..

ఆరు జిల్లాల్లో కరువు మండలాలు ఇలా..

జిల్లా తీవ్ర మోస్తరు మొత్తం

హనుమకొండ 00 11 11

వరంగల్‌ 00 08 08

జనగామ 01 03 04

భూపాలపల్లి 00 05 05

మహబూబాబాద్‌ 00 06 06

ములుగు 00 04 04

మొత్తం 01 37 38

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement