మధ్యవర్తిత్వంతో సమస్యల పరిష్కారం సులువు | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వంతో సమస్యల పరిష్కారం సులువు

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

భూపాలపల్లి అర్బన్‌: వ్యక్తిగత రాగద్వేషాలు, ప్రతీకార చర్యలకు దూరంగా ఉంటూ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి తాడూరు మహతి వైష్ణవి సూచించారు. శనివారం శిక్షణ పొందిన మీడియేటర్లు, కమ్యూనిటీ మీడియేటర్లు, పారా లీగల్‌ వాలంటీర్లతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసుల్లో చిక్కుకుని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పరస్పరం చర్చించుకుని సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో శిక్షణ పొందిన మీడియేటర్లు పి.ఆనందరావు, కనపర్తి కవిత, ఎస్‌.రవీందర్‌, మంగళపల్లి రాజ్‌కుమార్‌, ఇందరపు శివకుమార్‌, ఎల్‌.విష్ణు, ఎ.రవికుమార్‌, అంబాల ఆనందం, రాజమౌళి, రాజ్‌ కిరణ్‌, పారాలీగల్‌ వాలంటీర్లు శ్రీనివాస్‌, రజని, సందీప్‌ రాజ్‌, కిరణ్‌, అంజయ్య, లక్ష్మినారాయణ, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement