త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

Oct 24 2026 5:47 AM | Updated on Oct 24 2026 5:47 AM

భూపాలపల్లి: పోలీస్‌ అమరవీరుల త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ సంకీర్త్‌ అన్నారు. పోలీస్‌ ఫ్లాగ్‌ డే వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, ఆయుధాలు, సీసీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్‌ వ్యవస్థ, క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌ పనితీరును అధికారులు వివరించారు. ఏకే–47, ఎస్‌ఎల్‌ఆర్‌, కార్బైన్‌, 9 ఎంఎం పిస్టల్‌ తదితర ఆయుధాలను ప్రదర్శించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే విధానం, దర్యాప్తు ప్రక్రియ, డయల్‌ 112 సేవలపై అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాల నివారణ, ట్రాఫిక్‌ నిబంధనలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలు, బాలికల రక్షణ కోసం పనిచేస్తున్న షీ టీమ్స్‌, భరోసా కేంద్రం సేవలను వివరించారు. సైబర్‌ నేరాల బాధితులు వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ సంకీర్త్‌ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన పెంచుకుని ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఓపెన్‌ హౌస్‌కు జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేశ్‌ కుమార్‌, డీఎస్పీ సంపత్‌ రావు, సీఐ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, అధ్యాపకులు, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement