భూపాలపల్లి అర్బన్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయుధ, వాహన పూజలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్ ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలోని ఆయుధాలకు, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంటీ) విభాగంలోని పోలీస్ వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అన్నారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతలో ఆయుధాలు, పోలీస్ వాహనాలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, ఎస్బీ సీఐ నరేశ్, భూపాలపల్లి సీఐ శ్రీనివాస్, ఆర్‌ఐలు సంతోష్, రత్నం, పూర్ణచందర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


