మల్హర్(కాటారం): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) మధుసూదన్ అన్నారు. శనివారం కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మసీలో అత్యవసర మందుల నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఈపీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్, వైద్యాధికారులు మౌనిక, హారిక సిబ్బంది ఉన్నారు.
డీఎంహెచ్ఓ మధుసూదన్


