భూపాలపల్లి రూరల్: సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేస్తున్న కృషిలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత శాసనసభ సమావేశాల్లో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు. దీనిలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొన్నారు. కేటీకే–1, 8 ఇంకై ్లన్ గేట్ మీటింగ్‌ల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల హక్కులు, వారి కుటుంబాల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించేలా కృషి చేశారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఎమ్మెల్యే కృషికి ప్రాధాన్యం సంతరించుకుంది


