● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
రేగొండ: ప్రతీ ఉపాధి కూలీకి పని కల్పించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని రైతువేదికలో వీబీజీ రామ్జీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ గ్రామ పంచాయతీలో 100 నుంచి 150 మంది కూలీలు పనులకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఎల్నినో దృష్ట్యా గ్రామాల్లో జలసిరి పనులు చేపట్టాలని, ఇంటింటికీ ఇంకుడు గుంత, రైతు పొలంలో ఫామ్ పాండ్ నిర్మించాలన్నారు. అన్ని గ్రామాల్లో బోర్ రీచార్జ్ స్ట్రక్చర్లను చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 9న జరిగే జాబ్ మేళాలో అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీఓ జమీర్ పాషా, ఈసీ మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.


