రేగొండ: మండలకేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న జెట్టి శ్రావణ్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు మంగళవారం వెల్లడించారు. నిందితులు దమ్మన్నపేట క్రాస్ మీదుగా వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. రేగొండ మండలకేంద్రంలోని వైన్స్ ఎదుట మండలకేంద్రానికి చెందిన మల్లెబోయిన శ్రీకాంత్ బజ్జీల షాప్ నిర్వహిస్తున్నారు. అక్కడే రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జెట్టి శ్రావణ్ ఫాస్ట్ పుడ్ సెంటర్ ఐదేళ్లుగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో షాపు నిర్వహణ కోసం శ్రీకాంత్‌కు రూ.5లక్షలు శ్రావణ్ ఇప్పించాడు. డబ్బుల కోసం శ్రీకాంత్ ఇంటికి తరచూ వెళ్లే క్రమంలో అతని భార్యతో శ్రావణ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ జరిగినా శ్రావణ్ వైఖరిలో మార్పు రాకపోవడంతో పాటు అప్పుగా తీసుకున్న డబ్బులను అడుగుతూ ఇబ్బంది పెడుతున్నాడని అతనిపై శ్రీకాంత్ కక్ష పెంచుకున్నాడు. దీంతో శ్రీకాంత్ మరో ముగ్గురితో కలిసి ఈ నెల 3న రాత్రి శ్రావణ్‌ను అతని ఫాస్ట్ పుడ్‌సెంటర్ ముందే హత్య చేశారు. నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ కరుణాకర్ రావు, ఎస్సై సుధాకర్, సిబ్బందిని అభినందించారు.
హత్యకేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ సంపత్‌రావు


