ఆధ్యాత్మిక కేంద్రంగా కొడవటంచ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక కేంద్రంగా కొడవటంచ అభివృద్ధి

Jul 5 2026 2:54 AM | Updated on Jul 5 2026 2:54 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రేగొండ : ఆధ్యాత్మిక కేంద్రంగా కొడవటంచను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని కొడవటంచ ఆలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కోటంచ అభివృద్ధికి రూ.12.15 కోట్లు గతంలో కేటాయించిందన్నారు. మరింత అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం రూ.51 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో రాజగోపురం, కోనేరు, గోశాల, ఆర్చి గేట్లు తదితర దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోపు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ – ధర్మదాయ స్థపతి వల్లి నాయక్‌, ఆలయ మాజీ చైర్మన్‌ నాయినేని సంపత్‌రావు, దేవాదాయ శాఖ ఇంజనీర్‌ విభాగం ఎస్‌ఈ దుర్గప్రసాద్‌, డీఈఈ, రమేష్‌ బాబు, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ రమేష్‌ బాబు, డీఈ గౌస్‌, ఏఈ నవీన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలి

భూపాలపల్లి అర్బన్‌: ఎన్‌ఐ యాక్ట్‌కు సంబంధించిన చెక్‌ బౌన్స్‌ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్‌ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బ్యాంక్‌ అధికారులు, చిట్‌ఫండ్‌ కంపెనీల మేనేజర్లు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ద్వారా చెక్‌ బౌన్స్‌ కేసులను వేగంగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. బ్యాంకు అధికారులు, చిట్‌ఫండ్‌ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి అధి క సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు జూ నియర్‌ సివిల్‌ జడ్జి అఖిల, ప్రభుత్వ న్యాయవాది బోట్ల సుధాకర్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రాములు, న్యాయవాదులు విష్ణువర్ధన్‌, చిరంజీవి, మొయినుద్దీన్‌ ఉన్నారు.

న్యాయసేవలను ప్రతీ పౌరుడికి

చేరవేయాలి

ప్రతీ పౌరుడికి ఉచిత న్యాయసేవలు అందేలా పారా లీగల్‌ వలంటీర్లు పనిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్‌ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన పారా లీగల్‌ వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు న్యాయ అవగాహన కల్పించడంతోపాటు, ప్రభుత్వ ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించాలన్నారు.

యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఉచితశిక్షణ

మల్హర్‌(కాటారం): ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో కాటారం యూత్‌ ట్రైనింగ్‌ సెంట ర్‌లో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకుల కు వివిధ వృత్తి కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు సెంటర్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ శనివారం తెలిపారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌, సోలార్‌ పంప్‌ు టెక్నీషి యన్‌, రిటైల్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కంప్యూటర్స్‌, ఇంగ్లిష్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ కోర్సుల్లో శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఇతర వివరాలకు 63034 48760 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement