మల్హర్: మండలంలోని తాడిచర్ల వెలమలపల్లిలో గతంలో మూతపడిన ప్రాథమిక పాఠశాలను గురువారం డీఈఓ రాజేందర్ రీఓపెన్ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలను విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మూతపడిన పాఠశాలను తిరిగి తెరవడంతో గ్రామంలోని చిన్నారులకు విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. విద్యార్థులు దూరం వెళ్లే అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, ఎంఈఓ లక్ష్మణ్‌బాబు, తాడిచర్ల జెడ్పీహెచ్‌ఎస్ కాంప్లెక్స్ హెచ్‌ం తిరుపతిరెడ్డి, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, కుమారస్వామి, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పద్మ, గంగరాజు పాల్గొన్నారు.


