
భోజనంలో నాణ్యత పాటించాలి
పలిమెల: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలని జేఎస్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం పంకెనలోని కేజీబీవీ (బాలికల) పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్, వంట గది, సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, సమీకృత కార్యాలయాల భవన నిర్మాణ పనులు, ఏంఆర్‌సీ భవనాల్ని పరిశీలించారు. అనంతరం నర్సరీని పరిశీలించారు. మొదేడు రేంజ్ పరిధి అటవీ ప్రాంతంలో పర్యటించి అటవీ శాఖ వాచ్ టవర్, అడవుల సంరక్షణ, పెంపకానికి తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. వాచ్ టవర్ ప్రాంతంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, తహసీల్దార్ అనిల్, ఎంపీడీఓ ప్రకాశ్‌రెడ్డి, తదితరులున్నారు.
ఆకస్మిక తనిఖీ
రేగొండ: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. బుధవారం మండలంలోని కస్తూ ర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించారు. నిత్యావసర సరుకులను, రిజిస్టర్లను పరిశీలించారు.
నాణ్యమైన భోజనం అందించాలి
చిట్యాల: మోడల్ స్కూల్ వసతి గృహంలోని విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ రాజేందర్ అన్నారు. ఈసందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కళాశాల, బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎంఈఓ కె.రఘుపతి, ఏఎంఓ లక్ష్మ ణ్, జిల్లా ప్లానింగ్ కో–ఆర్డినేటర్ రాజగోపాల్, జీసీడీఓ శైలజ, కొత్తపల్లి గోరి ఎంఈఓ రాజు, టెక్నికల్ పర్సన్ మహేందర్, ప్రిన్సిపాల్ రమేశ్, ఎమ్మార్పీ సిబ్బంది ఆకుల హరీశ్, నరేశ్, రాజు ఉన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ రాహుల్ శర్మ