
కేబుల్స్ తొలగించాలి
కాటారం: విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లు తొలగించుకోవాలని ట్రాన్స్‌కో ఏ డీఈ నాగరాజు కేబుల్, ఇంటర్నెట్ నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని ఏడీ ఈ కార్యాలయంలో బుధవారం కేబుల్, ఇంటర్నెట్ నిర్వాహకులు, పోలీస్, ట్రాన్స్‌కో అధి కారులతో ఏడీఈ సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్, ఇంటర్నెట్‌కు సంబంధించిన తీగలు ఏర్పాటు చేయడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బా ధ్యతగా భావించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడితే సొంత మరమ్మతు చేయొద్దన్నారు. ఈ సమావేశంలో కాటారం ఏఈఈ ఉపేందర్, లైన్ ఇన్‌స్పెక్టర్ కిరణ్, కేబుల్, ఇంటర్నెట్ నిర్వాహకులు పాల్గొన్నారు.
కాటారం: ఆపదలో ఉన్న వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే తక్షణ సాయం అందించాలని 108 జిల్లా మేనేజర్ మేరుగు నరేశ్ 108 అంబులెన్స్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలో 108 వాహనాన్ని బుధవారం తనిఖీ చేశారు. వాహనం కండీషన్, అందుబాటులో ఉన్న మందులు, ఎమర్జెన్సీ పరికరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు మెడిసిన్స్ అప్‌డేట్ చేసుకొని అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాల్లో బాధితులకు ప్రథమ చికిత్స అందించి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి చేర్చాలన్నారు. అత్యవసర సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మేనేజర్ వెంట ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ శ్రీకాంత్, పైలెట్ విజేందర్ ఉన్నారు.
భూపాలపల్లి అర్బన్: ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సేవానాయక్, తిరుపతి, కుమారస్వామి, ప్రభాకర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాటారం: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పీఆర్‌టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సంఘం సభ్యులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 1న చేపట్టే మహాధర్నాలో సీపీఎస్ ఉపాధ్యాయులు పాల్గొ ని ఐఖ్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవీందర్, తిరుపతి, నాయకులు సురేశ్‌రావు, సంపత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కేబుల్స్ తొలగించాలి

కేబుల్స్ తొలగించాలి

కేబుల్స్ తొలగించాలి