
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కాళేశ్వరం: వర్షాలు, వరదలతో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి కాళేశ్వరం ఘాట్, వీఐపీ ఘాట్, చండ్రుపల్లి వాగులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ కడెం, గడ్చిరోలి మీదుగా వరద ప్రవాహం తరలివస్తుండటంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉదయం 7 గంటలకు సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం 12.220 మీటర్ల ఎత్తుకు నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నది పరీవాహక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందుగానే సమాచారం అందించడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 9030632608 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. అనంతరం ఎస్పీ కిరణ్‌ఖరే మాట్లాడుతూ అత్యవసర సేవలకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఏదేని అత్యవసర పరిస్థితిల్లో డయల్ 100కు కాల్ చేయాలన్నారు. అలాగే కాళేశ్వరం టు అన్నారం వెళ్లే రహదారిలో చండ్రుపల్లి వద్ద కాజ్‌వేపై వరద నీరు కమ్మెసిన తీరును కలెక్టర్ పరిశీలించారు. పూర్తిగా నీరు తగ్గే వరకు ప్రజలను ప్రయాణాలు చేయకుండా భారీ కేడింగ్ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్‌రెడ్డి, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, తహసీల్ధార్ రామారావు, ఎంపీడీఓ రవీంద్రనాధ్, ఎఫ్‌డీఓ శ్రీకాంత్, రేంజర్ రవికుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డిలు ఉన్నారు.
ఆలస్యం చేస్తే ఎప్పుడు పూర్తవుతుంది!
సరస్వతీనది పుష్కరాల సమయంలో కాళేశ్వరంలో మెయిన్ గోదావరి ఘాట్ వద్ద ఆర్చ్ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ రాహుల్‌శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కాళేశ్వరంలో వరద ఉధృతి పరిశీలనకు వచ్చిన ఆయన ఘాట్ వద్ద ఆర్చ్ నిర్మాణ పనులను పరిశీలించి దేవాదాయశాఖ ఇన్‌చార్జ్ ఏఈ అశోక్‌కు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎరువులు అందుబాటులో ఉంచాలి
రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం మహదేవపూర్‌లోని పీఏసీఎస్ ఎరువుల దుకాణాన్ని ఎస్పీ కిరణ్‌ఖరే, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో ఎరువుల నిల్వలు, రైతులకు అందజేస్తున్న విధానం, రికార్డులను పరిశీలించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. వారి వెంట పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏఓ సుప్రజ్యోతి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
కాళేశ్వరంలో
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ