
రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి
భూపాలపల్లి రూరల్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అన్నారు. బుధవారం భారతరత్న రాజీ వ్‌గాంధీ 81వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్పనాయకుడన్నారు. అనంతరం కమలాపూర్ గ్రామంలో వర్షాలతో దెబ్బతిన్న పెద్ద చెరువు కట్ట, మత్తడి పారే రోడ్డు ప్రాంతాన్ని ఎమ్మెల్యే, నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం భూపాలపల్లి మంజూరునగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, పీఆర్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపధ్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండాలన్నారు. భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్, సిబ్బంది, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏటీసీ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రా జబాబు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు