
సమాచారం ఇవ్వాలి
● ఎస్పీ కిరణ్‌ఖరే
కాటారం: వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయాల్లో పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కిరణ్‌ఖరే తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మహాముత్తారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, కేశవపూర్, పెగడపల్లి మధ్యలోని పెద్దవాగు, అలుగువాగును మంగళవారం ఎస్పీ పరిశీలించారు. పెద్దవాగు ఉధృతి, రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీస్‌శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలను సీఐ, ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం, పోలీస్‌శాఖ తరఫున తక్షణ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్‌కుమార్ ఉన్నారు.