
తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు
మొగుళ్లపల్లి: కొర్కిశాల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని.. విద్యార్థినుల తండ్రిదండ్రులు ఆందోళన చెందవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. డీఈఓ రాజేందర్, ఇన్‌చార్జ్ జిల్లా వైద్యాధికారి సునీత, మొగులపల్లి ఎస్సై అశోక్ గురువారం కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎనిమిది మంది పిల్లలకు వైరల్ ఫీవర్ రాగా.. నలుగురికి వాంతులు అయినట్లు తెలిపారు. స్కూల్ ఎస్‌ఓ శైలజను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం మండల వైద్యాధికారి నాగరాణి ఆధ్వర్యంలో స్కూల్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
డీఈఓ రాజేందర్