
లక్ష పుష్పార్చన
కాళేశ్వరం: శ్రావణ శుక్రవారం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీశుభానందదేవి(పార్వతీ) అమ్మవారికి వైభవంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాల పూలతో నియమ నిష్టలతో విశేష పూజలతో అర్చన చేశారు. హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం పఠనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అఽధికసంఖ్యలో పాల్గొన్నారు. వారికి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శనిగెల మహేష్, అర్చకులు భైకుంఠ పాండా, రామాచార్యులు, వెల్ది శరత్‌చంద్రశర్మ, గట్టు రాముఽశర్మ, రాధకృష్ణశర్మ, రామకృష్ణశర్మ పాల్గొన్నారు.