
ఆస్పిరేషనల్ బ్లాక్స్‌పై దృష్టి సారిస్తాం
భూపాలపల్లి: జిల్లాలోని ఆస్పిరేషనల్ బ్లాక్స్‌పై దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో యాస్పిరేషన్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమణ యాడ్లతో సమావేశం నిర్వహించారు. ఆస్పిరేషనల్ బ్లాక్ అయినటువంటి పలిమెలను హెల్త్ ఇండికేటర్స్ నివేదిక తీసుకునేందుకు 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్పెషల్ ఆఫీసర్ జిల్లాలో పర్యటించారు. నీలంపల్లి, పంకెన, పలిమెల మహాముత్తారం, కాళేశ్వరం బ్రాహ్మణపల్లి, రేగొండ పీహెచ్‌సీలను సందర్శించారు. అభివృద్ధి నివేదికను శుక్రవారం కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకునేందుకు అంగీకరించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ