
తప్పు చేస్తే చట్టపరంగా శిక్ష
భూపాలపల్లి: తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష తప్పదని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. వివిధ కేసుల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించి శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. జిల్లాలోని మహాముత్తారం, పలిమెల మండలాల్లో నాలుగు కేసుల్లో నిందితులకు శిక్షలు విధిస్తూ ఇటీవల జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతంగా పనిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, మహముత్తారం ఎస్సై మహేంద్రకుమార్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై వెంకన్న, కోర్టు డ్యూటీ ఆఫీసర్ కానిస్టేబుల్ రమేష్‌లను ఎస్పీ అభినందించి సత్కరించారు.
ఎస్పీ కిరణ్ ఖరే