
ఉద్యోగుల భద్రత ప్రభుత్వాల బాధ్యత
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగంపల్లి దర్శన్ గౌడ్ తెలిపారు. సీపీఎస్ రద్దుచేయాలని కోరుతూ చేపడుతున్న ర్యాలీ శుక్రవారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సెప్టెంబరు 1న నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్, స్థానిక నాయకులు రఘు రామస్వామి హరిహర ప్రసాద్, దిల్షాద్, శివ కష్ణ, కష్ణమూర్తి పాల్గొన్నారు.