
పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు
జిల్లాల వారీగా పాఠశాలలకు నిధులు మంజూరు ఇలా..(రూ.లక్షల్లో)
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంనుంచి పూర్వ ప్రాథమిక తరగతులు ప్రా రంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పా ఠశాలల్లో చిన్నారులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్ష ద్వారా పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో స్కూల్‌కు రూ.1.70లక్షల నిధులను కలెక్టర్లకు జమ చేశారు. హనుమకొండ జిల్లాలో 45 పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు మంజూరై విడుదలయ్యాయి. అందులో 25 స్కూళ్లకు రూ.1.70లక్షల చొప్పున, మరో 20 స్కూళ్లకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరు చేశారు.
రంగులు, విద్యార్థులకు ఆట వస్తువులు
ఆయా పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతి గదికి రూ.50వేలు వెచ్చించి రంగులు వేయించాల్సింటుంది. ఆట వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక్కో విద్యార్థికి రూ.1,000 కేటాయించి బ్యాగ్, షూస్, బెల్ట్, టై తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జిల్లా కలెక్టర్లకు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్.. డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు ప్రతీ పూర్వ ప్రాథమిక తరగతి విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయా, ఒక ఇన్‌స్ట్రక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
కొన్నింటికి రూ.1.70లక్షలు, మరికొన్నింటికి రూ.50వేల చొప్పున విడుదల
తరగతి గదికి కలర్,
ఆటవస్తువులకు, విద్యార్థులకు బ్యాగ్, షూస్, టై, బెల్టు
త్వరలోనే ఆయాలు,
ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
జిల్లా పాఠశాలలు నిధులు
భూపాలపల్లి 54 78.60
వరంగల్ 32 54.40
హనుమకొండ 65 52.50
మహబూబాబాద్ 22 37.40
జనగామ 15 21.90
ములుగు 08 13.60

పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు